Pawan Kalyan : 27 నుంచి పవన్ ప్రచారం ప్రారంభం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు

Update: 2024-03-21 01:53 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం ఉండనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉత్తరాంధ్ర నుంచి...
వారాహి వాహనాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఈ నెల 27వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ఉండనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలోనూ పవన్ కల్యాణ్ తొలి విడత ప్రచారంలో పర్యటించనున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ‌్ ప్రచారానికి సంబంధించి పూర్తి సెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.


Tags:    

Similar News