Pawan Kalyan : 30వ తేదీ వరకూ కాకినాడలోనే పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఈ నెల 30వరకూ కాకినాడలోనే ఉంటారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన కాకినాడలోనే ఉన్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ కాకినాడలోనే పవన్ కల్యాణ్ ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. అందుకే అక్కడే ఆయన మకాం వేసి పార్టీ నేతలతో చర్చంచనున్నారని తెలిసింది. సీనియర్ నేతలతో సమావేశమై పొత్తులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కూడా నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
బలం ఉన్న...
తనకు, జనసేనకు అధిక బలం ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 32 నియోజకవర్గాలుండగా, అందులో అత్యధిక స్థానాలను పొత్తులో భాగంగా తాము తీసుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని పవన్ భావిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లోనూ తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు పథ్నాలుగు శాతం ఓట్లు రావడం, పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు శాతం ఓట్లు పైగానే రావడం, ఆ శాతం ఇప్పుడు పెరిగిందన్న సర్వేల ఆధారంగా ఆయన ఇక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.