సత్తెనపల్లిలో పవన్ కు ఘన స్వాగతం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లికి చేరుకున్నారు. గుంటూరు శివారు నల్లపాడు వద్ద పవన్ అభిమానులు గజమాలతో సత్కరించారు;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లికి చేరుకున్నారు. గుంటూరు శివారు నల్లపాడు వద్ద పవన్ అభిమానులు గజమాలతో ఆయనను సత్కరించారు. అయితే పోలీసులు ఇందుకు అభ్యంతరం తెలిపారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు వారించారు.
గజమాల వేసి...
ప్రొక్లెయిన్ తో గజమాల వేస్తున్నట్లు ముందుగా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు జనసేన నేతలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసేన నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పూలమాల వేయకూడదా? అంటూ నిరసన తెలియజేయడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.