Pawan Kalyan : రిజల్ట్ జగన్ భయపడే విధంగా ఉండాలి

జగన్ పేదవారిని దోచుకున్నారని, క్లాస్ వార్ అని అంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు

Update: 2024-04-17 13:12 GMT

జగన్ పేదవారిని దోచుకున్నారని, క్లాస్ వార్ అని అంటున్నారని, పేదలు దోచుకుంటున్నది జగన్ మాత్రమేనని పవన్ కల్యాణ్ అన్నారు. పెడనలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తనను నియోజకవర్గాలు ఎందుకు మార్చుతున్నావని జగన్ అడుగుతున్నాడని, మరి జగన్ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు మార్చాడని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట గొట్టారని జగన్ పై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. విద్యుత్తు బిల్లులు పది సార్లు పెంచి పేదలను దోచుకుతింటున్నాడని పవన్ ఫైర్ అయ్యాడు. తాము మీకోసం నిలబడే వాళ్లంకాని, పదవుల కోసం కాదని అన్నారు.

కనీసం రోడ్లను కూడా...
రాజధాని అమరావతిని నిర్మించకుండా చేయడంతో అక్కడ పేదలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా? అని ప్రశ్నించారు. కనీసం రోడ్లను కూడా జగన్ తన పాలనలో అభివృద్ధి చేయలేదన్నారు. పేకాట క్లబ్‌లు నడుపుకునే వారు ఎమ్మెల్యేలని అన్నారు. మట్టి మాఫియా కోసం వినతిపత్రాలు ఇస్తే జనసైనికులపై కేసులు పెట్టారన్నారు. మున్సిపల్ వర్కర్లను కూడా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఉపాధి హామీలో ఎక్కువ అక్రమాలు జరిగాయని పార్లమెంటులోనే కేంద్ర ప్రభుత్వం చెప్పిందని పవన్ స్పష్టం చేశారు.
చేనేతకార్మికులను...
చంద్రబాబు, తాను, బీజేపీ చేనేత కార్మికులకు, కళంకారీ కార్మికులను కన్నీళ్లుపెట్టించమన్నారు. వారిని ఆదుకుంటామని తెలిపారు. మత్స్యకారుల సోదరులను అన్ని రకాలుగా అండగా నిలుస్తామని తెలిపారు. మహిళలకు సొంత కాళ్ల మీద నిలబడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తమ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పయనింప చేయాలా చేస్తామన్నారు. జగన్ అనే వ్యక్తిని భయపెట్టే విధంగా రిజల్ట్ ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు. తమను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తాము మరింత బలపడతామని ఆయన అన్నారు.


Tags:    

Similar News