నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఆమెనే టార్గెట్

తిరుపతిలోని శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఆమె ఓ వ్యక్తిపై చెయ్యి

Update: 2023-07-17 01:48 GMT

తిరుపతిలోని శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఆమె ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకోవడం.. ఆ వ్యక్తి జనసేన నేత కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఆమె మీద ఫిర్యాదు చేయడానికి శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వ్యవహారంపై నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ నేతపై సీఐ తీరును జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సీఐపై చర్యలు తీసుకోవాలని సోమవారం తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. సోమవారం ఉదయం 10.30 ప్రత్యేక విమానంలో తిరుపతికి పవన్ రానున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు జనసైనికులు బైక్ ర్యాలీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూపై ఇప్పటికే తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి డీఎస్పీకి నివేదిక పంపారు. అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టకూడదని జనసేన నేతలకు పోలీసులు సూచించారు. పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఢిల్లీకి పయనం కానున్నారు.

సీఐ అంజు యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి విచారణ జరిపి, డీజీపీకి నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంజు యాదవ్‌కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు స్టేషన్ ఆఫీసర్, తిరుపతి డీఎస్పీ, తిరుపతి ఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపి ఈ నెల 27న నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
అంజు యాదవ్‌పై గతంలోనూ వివాదాలు ఉన్నాయి. విధి నిర్వహణలో పలు కేసుల విచారణ సమయంలో చార్జి మెమోలు, ఎంక్వైరీలను ఆమె ఎదుర్కొన్నారు. ఆమె ఇంటరాగేషన్ చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Tags:    

Similar News