ఎల్లుండి సత్తెనపల్లికి పవన్

ఈ నెల18 వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో పర్యటించనున్నారు.;

Update: 2022-12-16 08:19 GMT

ఈ నెల18 వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు పవన్ కల్యాణ్ గత కొద్ది రోజులుగా సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పవన్ చనిపోయిన రైతు కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు.

కౌలు రౌతులను...
ప్రభుత్వం కౌలు రౌతులను పట్టించుకోవడం లేదని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం లేదని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జనసేననేతలు పరిశీలించారు. ఆయన సభకు హాజరయ్యే రైతు కుటుంబ సభ్యలను కూడా కలసి ఆహ్వానించి వచ్చారు. పోలీసు అనుమతి కూడా తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని వారు పోలీసులను కోరుతున్నారు.


Tags:    

Similar News