Nagababu : కాపు పారిశ్రామికవేత్తలతో నాగబాబు రహస్య సమావేశం

కాపు సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలతో జనసేన నేత నాగబాబు రహస్యంగా సమావేశమయ్యారు;

Update: 2024-01-05 03:41 GMT
Nagababu : కాపు పారిశ్రామికవేత్తలతో నాగబాబు రహస్య సమావేశం
  • whatsapp icon

Nagababu:కాపు పారిశ్రామికవేత్తలతో జనసేన నేత నాగబాబు రహస్యంగా సమావేశమయ్యారు. విశాఖ బీచ్‌రోడ్ లోని ఒక కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ సమావేశానికి నాగబాబు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి అనేక మంది కాపు సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుపునకు ప్రయత్నించాలని నాగబాబు పారిశ్రామికవేత్తలను కోరినట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి పదవిపైనా...
ఇందుకోసం పార్టీకి ఆర్థికంగా కూడా సాయం అందించాలని ఆయన అడిగినట్లు సమాచారం. విరాళాలివ్వాలని కోరినట్లు తెలిసింది. అందుకు హాజరైన వారిలో చాలా మంది పారిశ్రామిక వేత్తలు పాజిటివ్ గా నే స్పందించినట్లు చెబుతున్నారు. మరోవైపు తమ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారన్న లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే నాగబాబు మాత్రం ముఖ్యమంత్రితో పాటు పదవులు పంపకంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇద్దరూ మాట్లాడుకుంటారని చెప్పినట్లు తెలిసింది.
Tags:    

Similar News