Janasena : నేడు జనసేన అభ్యర్థుల ప్రకటన

నేడు జనసేన అభ్యర్థులను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది

Update: 2024-03-14 01:58 GMT

నేడు జనసేన అభ్యర్థులను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇప్పటి వరకూ ఆరుగురు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. ఈరోజు మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. నిన్నటి నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న పవన్ కల్యాణ్ నేతలతో మాట్లాడుతూ వారికి సంకేతాలు ఇస్తున్నారు. వారికి కేటాయించే నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించుకోవాలంటూ చెబుతుండటంతో వారి పేర్లు జాబితాలో ఉండే అవకాశముంది. మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులకు ఈ మేరకు పవన్ కల్యాణ్ నుంచి టిక్కెట్ హామీ లభించినట్లు తెలిసింది.

తొమ్మిది నియోజకవర్గాల్లో...
యలమంచలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయకుమార్, పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ యాదవ్‌లకు ఓకే చెప్పినట్లు తెలిసింది. మీరు నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసుకోవాలని పవన్ సూచించినట్లు తెలిసింది. అలాగే తాడేపల్లి గూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు, రాజోలు నుంచి వరప్రసాద్ పేర్లను జనసేనాని ఖరారు చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News