Janasena : నేడు జనసేన కార్యాలయంలో భేటీ
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నేడు సమావేశం కానున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నేడు సమావేశం కానున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని చోట్ల గెలుపొందిన సంగతి తెలిసిందే. రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది. వంద శాతం స్ట్రైకింగ్ రేట్ తో జనసేన ఈ ఎన్నికల్లో టీడీపీ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
పవన్ ను శాసనసభ పక్ష నేతగా...
పవన్ కల్యాణ్ ను తమ నేతగా ఎన్నుకోవడం ద్వారా ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కనుందని చెబుతున్నారు. చంద్రబాబు మంత్రి వర్గంలో పవన్ కల్యాణ్ చేరినప్పటికీ ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయన పొందుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన అధినేత తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు. ఆయన పదేళ్ల పాటు నిరీక్షణ త్వరలో ఫలించబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనకు చంద్రబాబు మంత్రి వర్గంలో నాలుగు పదవులు వస్తాయని చెబుతున్నారు.