నేడు జనసేన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్ లో పెంచనున్న విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా నేడు జనసేన పార్టీ కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టనుంది

Update: 2022-04-01 02:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో పెంచనున్న విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా నేడు జనసేన పార్టీ కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టనుంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విద్యుత్తు ఛార్జీలను పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిరసనలు తెలిపి ప్రజలకు అండగా నిలబడాలని పవన్ జనసైనికులను కోరారు. ప్రభుత్వం పెంచిన ఛార్జీలను తగ్గించేంత వరకూ పోరాటం ఆపకూడదని కోరారు.

తగ్గించేంత వరకూ....
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీలతో విద్యుత్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం నేరుగా అత్యధిక శ్లాబులను ఏర్పాటు చేసి ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం మొదలు పెట్టిందన్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచవద్దంటూ కలెక్టర్లకు జనసేన నేతలు నేడు వినతి పత్రాలను సమర్పించనున్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలు ఉపసంహరించుకునేంత వరకూ దశల వారీగా ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.


Tags:    

Similar News