హైకోర్టులో జనసేన పిటీషన్ విచారణ

నేడు హైకోర్టులో జనసేన పిటీషన్ విచారణ జరగనుంది. విశాఖలో కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది.

Update: 2022-10-18 03:15 GMT

నేడు హైకోర్టులో జనసేన పిటీషన్ విచారణ జరగనుంది. విశాఖలో తమ పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా తమ కార్యక్రమాలను కూడా పోలీసులు అడ్డుకున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు వద్ద జరిగిన సంఘటనను పిటీషన లో వివరించారు.

కేసును రద్దు చేయాలంటూ...
మంత్రి రోజా పీఏ దిలీప్ కుమార్, సీఐ నాగేశ్వరరావులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలంటూ జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.


Tags:    

Similar News