నేడు బెజవాడలో పవన్ జనవాణి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు;
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ జనవాణి కార్యక్రమం జరుగుతుంది. గత ఆదివారం కూడా పవన్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 231 సమస్యలు ప్రజల నుంచి వచ్చాయి. ఈరోజు కూడా జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఏకాదశికి...
కాగా పవన్ కల్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అంద చేశారు.