సీఎస్ గా జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఆంధప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు సమీర్ శర్మ బాధ్యతలను అప్పగించారు.

Update: 2022-11-30 12:04 GMT

ఆంధప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు సమీర్ శర్మ బాధ్యతలను అప్పగించారు. చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని నియమిస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన 1990వ బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను నియమించారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పదవీకాలం ఈరోజుతో ముగిసింది.

రెండేళ్ల వరకూ...
జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా 2024 జూన్ వరకూ పదవిలో ఉండనున్నారు. అంటే వచ్చే శాసనసభ ఎన్నికల వరకూ చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి వ్యవహరించే అవకాశాలున్నాయి. ఆయన ప్రస్తుతం సీఎంవోలో పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను నియమించారు. సమీర్ శర్మను కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో సీనియర్ అధికారిగా నియమించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News