వైఎస్ అవినాష్ రెడ్డి పిటీషన్‌పై నేడు తీర్పు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో వేసిన మధ్యంతర పిటిషన్లపై ఈరోజు తీర్పు రానుంది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో వేసిన మధ్యంతర పిటిషన్లపై ఈరోజు తీర్పు రానుంది. తనపై చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనపై ఈరోజు న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. సీబీఐ అధికారులు ఇప్పటికే అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించారు. సాక్షిగానే పరిగణించి ఆయనను విచారిస్తున్నామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
అరెస్ట్ చేయవద్దంటూ...
అయితే తనను అరెస్ట్ చేయవద్దని, సీబీఐ కొందరి ఆదేశాలకు లోబడి పనిచేస్తుందని వైఎస్ అవినాష్ రెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనను విచారణ అనంతరం అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. తనకు, వైఎస్ వివేకాకు సంబంధం లేదని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అవినాష్ రెడ్డి పిటీషన్ పై తీర్పు ఎలా రానుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.