ఏపీ న్యాయవ్యవస్థపై జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రత్యర్థులతో కన్నా న్యాయవ్యవస్థతోనే ఎక్కువగా పోరాడాల్సి వస్తుందని జస్టిస్ చంద్రు అన్నారు.

Update: 2021-12-11 02:03 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రత్యర్థులతో కన్నా న్యాయవ్యవస్థతోనే ఎక్కువగా పోరాడాల్సి వస్తుందని జస్టిస్ చంద్రు అన్నారు. న్యాయవ్యవస్థ ఇక్కడ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు కన్పిస్తుందన్నారు. అందుకే చట్ట సభల్లో చేసిన చట్టాలను న్యాయమూర్తులకు భయపడి ఉపంసంహరించుకుంటుందని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను కూడా సరిచేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడయాలో....


విజయవాడలో ఎంబీవీకే భవన్ లో జరిగిన సదస్సులో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తులను తప్పుపడుతూ కామెంట్స్ పెడితే వారిపై సీబీఐ కేసులు నమోదు చేయడమేంటని జస్టిస్ట్ చంద్రు ప్రశ్నించారు. ప్రజల కోసమే న్యాయం ఉండాలన్నారు. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య అంతరం ఉండటం సరికాదన్నారు.

మరో మార్గంలో....
ఆంధ్రప్రదేశ్ లో న్యాయవ్యవస్థ మరో మార్గంలో నడుస్తుందని అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కొందరు పిటీషన్ వేస్తే అక్కడే భూముుల ఉన్న న్యాయమూర్తులు ఈ కేసును ఎలా విచారిస్తారని జస్టిస్ చంద్రు ప్రశ్నించారు. అయితే ఈ కేసును తామే విచారణ చేస్తామని చెప్పడం ఎంత వరకూ న్యాయమన్నారు. మొత్తం మీద జస్టిస్ చంద్రు ఏపీ న్యాయవ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News