నేడు సీబీఐ ఎదుటకు వైఎస్ భాస్కర్‌రెడ్డి

కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఆదివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

Update: 2023-03-12 02:48 GMT

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఆదివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కడప సెంట్రల్‌ జైలులోని అతిఽథి గృహంలో వివేకా హత్య గురించి సీబీఐ బృందం భాస్కర్‌రెడ్డిని విచారించనుంది.

వివేకాహత్య కేసులో...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఇటీవల స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఆయన తండ్రిని కూడా ఈ కేసులో విచారించాలని నిర్ణయించారు. అందుకోసమే నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు భాస్కర్‌రెడ్డి హాజరు కానున్నారు.


Tags:    

Similar News