నా ప్రతిష్టను దెబ్బతీసే యత్నం
కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డికి సీబీఐకి లేఖ రాశారు.
కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డికి సీబీఐకి లేఖ రాశారు. తాను ఈరోజు విచారణకు హాజరు అవుతున్నట్లు తెలిపారు. వివేకా హత్య జరిగిన నాటి నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని, పనిగట్టుకుని ఒక వర్గం మీడియా తనకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు.
పారదర్శకంగా....
అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని తాను కోరుకుంటున్నానని అవినాష్ రెడ్డి లేఖలో కోరారు. ఆడియో, వీడియో రికార్డింగ్ లకు అనుమతించాలని ఆయన లేఖలో కోరారు. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతించాలని లేఖలో వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు.