ద్వారంపూడి మరోసారి బాబును ఏమన్నారో తెలుసా?

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2021-12-02 09:05 GMT

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు కాచుక్కూర్చున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి మరోసారి అయ్యే అవకాశం లేదని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ఫెయిలేనని ఆయన అన్నారు.

గుంటనక్క....
మరోవైపు వచ్చే ఎన్నికల్లో కాకినాడ పట్టణ టిక్కెట్ కొండబాబుకు రాదని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మరొక వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న ప్రభుత్వానికే ప్రజలు మరోసారి మద్దతు పలకడం ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబు గుంటనక్క లాంటోడని, నమ్మవద్దని ఆయన కోరారు.


Tags:    

Similar News