ఆర్కే కు ముద్రగడ ఘాటు లేఖ

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా లేఖ రాశారు

Update: 2022-03-30 06:02 GMT

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా లేఖ రాశారు. ఒక ఇంటర్వ్యూలో తనను అవమానించిన తీరును ఆయన తప్పుపట్టారు. కాపు ఉద్యమాన్ని తాను పేదల కోసం చేశానని, వారి ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యమించానని, అంతే తప్ప లక్షాధికారిని కోటీశ్వరులుగా చేయడం కోసం ఉద్యమం చేయలేదని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. మీ ఆలోచనలు అమలు చేయడానికి తాను అసమర్ధుడిని, చేతకాని వాణ్ణి కాదన్నారు. మీలాగా ఎదుటి వారిని ఏకవచనంతో సంభోధించే పత్రికా యజమానులను తాను ఇంతవరకూ చూడలేదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

మీ చరిత్రే అవసరం....
ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్ గా ఉండి సైకిల్ పై తిరిగే మీరు ఆ పత్రిక యజమాని కెఎల్ ప్రసాద్ ను కుర్చీలో నుంచి కాళ్లుపట్టుకని లాగి, పత్రికను సొంతం చేసుకున్న చరిత్ర మీది అని ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు సమయంలో బంగారం దుకాణాల యజమానులను బెదిరించి వాటిని చెలామణిలోకి తెచ్చుకుంది నిజంకదా? అని ముద్రగడ ప్రశ్నించారు. రెండు తలలు కలసి పుట్టిన పిల్లలను విడదీయడానికి ఎలా డబ్బు సంపాదించాలో తెలిపే విధానాన్ని ప్రజలకు మీరు చెప్పాలి. నా చరిత్ర కంటే తక్కువ కాలంలో కోటీశ్వరులయిన మీ చరిత్ర ప్రజలకు అవసరమని ముద్రగడ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బెట్టింగ్ లను ప్రోత్సహించి ఎలా డబ్బు సంపాదించారో ప్రజలకు తెలియజేయాలని ముద్రగడ కోరారు.


Tags:    

Similar News