చంద్రబాబు పై ముద్రగడ ఫైర్.. లేఖతో షాక్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. మీ కుటుంబానికే గౌరవం, ప్రతిష్ట ఉంటుందా? మా కుటుంబానికి ఉండవా? అని ముద్రగడ చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయాయని చెప్పారు. మీ కుటుంబం కంటే మా కుటుంబానికి చరిత్ర ఉందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
తమ కుటుంబాన్ని....
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తుంటే తమను ఎంతగా నాడు అవమానించారో గుర్తు లేదా? అని ముద్రగడ చంద్రబాబును ప్రశ్నించారు. ఎవరికైనా ఒకటే బాధ ఉంటుందని, అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఒకసారి గుర్తు చేసుకోవాలని ముద్రగడ చంద్రబాబు నాయుడిని కోరారు.