అవినాష్ రెడ్డి అంతా చేశారు.. ఏపీ సర్కార్ అఫడవిట్
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం సంభవించింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది;

avinashreddy
వివేకా హత్య కేసులో కీలక పరిణామం సంభవించింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. వివేకా హత్య కేసును అవినాష్ తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ అఫడవిట్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పార్లమెంటు సభ్యుడు అవినాష్ మార్గనిర్దేశంతోనే సీబీఐ అధికారి రాంసింగ్, వైఎస్ సునీత, నర్రెడ్డిపై కేసు నమోదు చేశారని తెలిపింది.
హత్య కేసులో...
వైఎస్ వివేకా హత్య కేసును తారుమారు చేసే కుట్ర చేశారని అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. సీబీఐని, వివేకా కుటుంబ సభ్యులను భయపెట్టాలని చూశారని పేర్కొంది. కొందరు పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో అవినాష్ రెడ్డి ఈ కుట్రకు తెరలేపారని తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగానే కేసును తప్పుదోవ పట్టిచారని అదనపు అఫడవిట్ లో అవినాష్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం పేర్కొంది.