రఘురామ కృష్ణ రాజు కేసులో కీలక పరిణామం

ఆంధప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది;

Update: 2025-04-02 01:47 GMT
key development, raghurama krishna raju,, supreme court
  • whatsapp icon

ఆంధప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 7, 8 తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

మధ్యంతర ఉత్తర్వులు...
గతంలో ప్రభావతికి మధ్యంతర ఉపశమనం కల్పించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం తాజాగా దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తుకు సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో విచారణకు సహకరించకపోతే మధ్యంతర ఉపశమనం రద్దు అవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేసింది.


Tags:    

Similar News