జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని

మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు.

Update: 2022-06-29 10:28 GMT

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. మచిలీపట్నంలో వారసుడినే గెలిపించాలని ఇల్లరికం వచ్చిన కొల్లు రవీంద్ర (టీడీపీ)ని కాదని చెప్పారు. వైసీపీ తరపున మాజీ మంత్రి పేర్ని నాని నిలబడినా, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడిగా గెలిపించాలని అన్నారు. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని... మామ, అల్లుడు కాదని అన్నారు. వారసత్వం అంటే వైయస్సార్, వైయస్ జగన్ అని... సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని అన్నారు. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు.

అంతకు ముందు రోజు కొడాలి నాని.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ చెప్పుకొచ్చారు. ఏ రంగు అయినా వేసుకోవచ్చని చెప్పారు. చంద్రబాబు గుడివాడ వస్తారు వెళ్తారు..కానీ, ఎప్పటి నుంచో గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు చెబుతూనే ఉన్నారన్నారు. ఎన్టీఆర్ మా ఆస్తి, గుడివాడ ప్రజల హక్కు. మా కోసం పార్టీ పెట్టిన నాయకుడు.. మా కోసం జీవించిన నాయకుడు ఆయన. అన్నగారికి వెన్నుపోటు పొడిచి.. ఆయన పార్టీని లాక్కోని.. ఆయన ముఖ్యమంత్రి పదవిని కాజేసి.. టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పార్టీతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వారు కాదని పేర్కొన్నారు. టీడీపీకి, ఎన్టీఆర్ కు సంబంధం లేదని ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని వెన్నుపోటి పొడిచిన వ్యక్తి చంద్రబాబు కాదా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. తనను ఓడించినా..గెలిపించినా అది గుడివాడ ప్రజల చేతిలోనే ఉందన్నారు. 'నాది గుడివాడ.. నేను 2004లో గెలిచా.. 2009లో గెలిచా.. 2019లో గెలిచా.. 2024లో గెలుస్తా.. 2029లో గెలుస్తా.. ఇక్కడే పుట్టా.. ఇక్కడే చనిపోతా.. ఇక్కడే మట్టిలో కలిసిపోతా' అని కొడాలి నాని అన్నారు.


Tags:    

Similar News