డిప్యూటీ స్పీకర్ గా కొలగట్ల వీరభద్రస్వామి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా కొలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Update: 2022-09-19 06:43 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా కొలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. దీంతో కొలగట్ల వీరభద్రస్వామిని స్పీకర్ ఛెయిర్ వరకూ తీసుకు వచ్చి కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి జగన్, టీడీపీ నేత అచ్చెన్నాయుడులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.

కోన రాజీనామా చేయడంతో....
మొన్నటి వరకూ కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఉండేవారు. ఆయన రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేశారు. ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయనను డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన కొలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


Tags:    

Similar News