కోనసీమలో క్రాప్ హాలిడే.. 11 ఏళ్ల తర్వాత
కోనసీమ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించాలని నిర్ణయించారు
కోనసీమ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించాలని నిర్ణయించారు. కోనసీమ రైతుల పరిరక్షణ సమితి ఈ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాలోని 12 మండలాలో క్రాప్ హాలిడే ను ప్రకటించారు. ప్రభుత్వం సహకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు.
కారణాలివేనట....
పంటలు వేయడానికి కూడా తమకు డబ్బులు లేవని, అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఎరువుల ధరల దగ్గర నుంచి అన్నీ పెరగిపోయాయని, కానీ మద్దతు ధర మాత్రం లభించడం లేదని చెబుతున్నారు. సేకరించిన ధాన్యానికి కూడా సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్నారు. కోనసీమలో 2011లో రైతులు క్రాప్ హాలిడే ను ప్రకటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత తిరిగి క్రాప్ హాలిడేను ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే టీడీపీ ట్రాప్ లో పడొద్దని మంత్రి విశ్వరూప్ సూచించారు. కొందరు రైతు సంఘాల నేతల ముసుగులో పార్టీ నేతలుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.