Koneti Adimulam: నన్ను హనీ ట్రాప్ చేశారు.. గుండెకు స్టంట్ కూడా ఉంది: ఆదిమూలం

టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు;

Update: 2024-09-11 03:03 GMT
KonetiAdimulam, Adimulam, TDPAdimulam, HoneyTrap, tdp latest updates, AP political news

KonetiAdimulam

  • whatsapp icon

టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తనపై కోనేటి ఆదిమూలం పలుమార్లు లైంగికంగా వేధించాడని ఓ మహిళ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేసింది. తాను కూడా టీడీపీలోనే ఉన్నానని, తనను ఎంతగానో వేధించారని ఆమె వాపోయింది. ఈ ఆరోపణల అనంతరం టీడీపీ అధిష్టానం కోనేటి ఆదిమూలంను పార్టీ నుండి బహిష్కరించింది. టీడీపీ మహిళా నేత ఇచ్చిన ఫిర్యాదు పై సెప్టెంబర్ 5 న కేసు నమోదు చేశారు పోలీసులు.

అయితే తాను ఏ తప్పూ చేయలేదని, తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టి వేయాలని హైకోర్ట్ లో పిటిషన్ వేశారు కోనేటి ఆదిమూలం. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. తనపై హనీ ట్రాప్ జరిగిందని ఆరోపించారు. జూలై, ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు. 72 సంవత్సరాల వయస్సులో తాను గుండె కు స్టెంట్ వేయించుకున్నానని పిటిషన్ లో పేర్కొన్నారు కోనేటి ఆదిమూలం.


Tags:    

Similar News