పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే నిరసన .. రావులపాలెంలో ఉద్రిక్తత

కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఆందోళన చేస్తున్నారు.;

Update: 2022-07-11 06:58 GMT

కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఆందోళన చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి చిర్ల జగ్గిరెడ్డి పోలీస్ స్టేషన్ లోనే ఉండి నిరసన తెలియజేస్తున్నారు. గోపాలపురంలో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫొటోలు ముద్రించిన ఘటన జరిగింది. ఈ ఘటనపై దళిత యువకులు ఆందోళన చేశారు. ఆందోళనల్లో పాల్గొన్న 18 మంది దళిత యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తప్పుడు కేసులంటూ...
దళిత యువకులపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ధర్నాకు దిగారు. రాత్రి పోలీస్ స్టేషన్ లోనే నిద్రించారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేంత వరకూ తాను ఆందోళనను విరమించనని ఆయన చెబుతున్నారు. జగ్గిరెడ్డి ఆందోళనకు ఎంపీ చింతా అనూరాధ మద్దతు తెలిపారు. జగ్గిరెడ్డి అనుచరులు రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.


Tags:    

Similar News