మాకు కార్పొరేషన్ వద్దు
అమరావతి కార్పొరేషన్ లో తమను విలీనం చేయడంపై కురగల్లు రైతులు అభ్యంతరం తెలిపారు. అధికారులు గ్రామసభను నిర్వహించారు
అమరావతి కార్పొరేషన్ లో తమను విలీనం చేయడంపై కురగల్లు రైతులు అభ్యంతరం తెలిపారు. అధికారులు గ్రామసభను నిర్వహించారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయని ప్రభుత్వం కార్పొరేషన్ పేరిట తమపై పన్నుల భారం వేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. తాము పన్నులు చెల్లించలేమని కూడా రైతులు అధికారులకు వివరించారు. తమకు కార్పొరేషన్ అవసరం లేదని వారు అధికారులకు చెప్పారు.
ఏం అభివృద్ధి చేశారని...?
మరికొందరు రైతులు మాత్రం తమను మంగళగిరి కార్పొరేషన్ లో కలపాలని కోరారు. తాము భూములు ఇవ్వలేదని, కనుక తమను మంగళగిరి కార్పొరేషన్ లో కలపాలని కోరారు. దీంతో రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. గ్రామ సభలో ఎక్కువ మంది కార్పొరేషన్ ను తమ గ్రామాన్ని విలీనం చేయడానికి అభ్యంతరం తెలిపారు.