ల్యాప్ టాప్ పేలుడు ఘటన : చికిత్స పొందుతూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి

బెంగళూరులోని మ్యాజిక్ టెక్ సొల్యూషన్ అనే ఐటీ కంపెనీలో సుమలత పనిచేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటివద్ద

Update: 2022-04-22 13:13 GMT

కడప : ఇటీవల కడప జిల్లాలోని మేకవారిపల్లెలో సుమలత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ల్యాప్ టాప్ కు ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా.. అది పెద్ద శబ్దంతో బాంబులా పేలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమలతకు తీవ్రగాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమలత (22) శుక్రవారం మృతి చెందింది.

బెంగళూరులోని మ్యాజిక్ టెక్ సొల్యూషన్ అనే ఐటీ కంపెనీలో సుమలత పనిచేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటివద్ద నుంచే పనిచేస్తుండగా, ఏప్రిల్ 18 సోమవారం ల్యాప్ టాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ల్యాప్ టాప్ పేలడంతో పాటు, విద్యుదాఘాతంతో సుమలత తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో ఆమెను కుటుంబసభ్యులు కడప సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు రిమ్స్ కు తరలించారు. అప్పటికే సుమలతకు 80 శాతం కాలిన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న సుమలత శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది.


Tags:    

Similar News