బీ అలర్ట్.. వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్ టాప్
జిల్లాలోని బద్వేల్ మేకవారిపల్లెకు చెందిన సుమలత (24) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. చాలాకాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది.
బద్వేల్ : కరోనా రాకతో.. రెండేళ్లుగా చాలామంది ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కే పరిమితమయ్యారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఐటీ ఉద్యోగులు చాలా కాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. లేచింది మొదలు.. పడుకునే వరకూ ల్యాప్ టాప్ పట్టుకుని కూర్చుంటున్నారు. అలా ఓ మహిళ ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తుండగా అది ఉన్నట్లుండి పేలిపోయింది. ఛార్జింగ్ పెట్టి ల్యాప్ టాప్ లో పనిచేయడంతో పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడింది.
ఈ ఘటన కడప జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని బద్వేల్ మేకవారిపల్లెకు చెందిన సుమలత (24) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. చాలాకాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఎప్పటిలాగే ల్యాప్ టాప్ కు ఛార్జింగ్ పెట్టి ఆఫీస్ వర్క్ చేసుకుంటుండగా.. ఒక్కసారిగా అందులో నుంచి మంటలు చెలరేగి పెద్ద బాంబులా పేలిపోయింది. ఆ ధాటికి సుమలత తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు వెంటనే సుమలతను కడపలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కంటిన్యూగా ల్యాప్ టాప్ కు ఛార్జింగ్ పెట్టి పనిచేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారంతా జరంత జాగ్రత్తగా ఉండండి!