Tirumala : వరస సెలవులతో పెరిగిన రద్దీ.. క్యూ లైన్ దాటి బయట వరకూ భక్తుల నిరీక్షణ

మూడు రోజుల పాటు వరస సెలవులు రావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు

Update: 2024-01-26 03:20 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మూడు రోజుల పాటు వరస సెలవులు రావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లనీ భక్తులతో నిండిపోయి. వసతి గృహాలు దొరకక భక్తులు బయటే తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. భక్తులు అత్యధిక సంఖ్యలో రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా భక్తుల కోసం అన్న ప్రసాదాలను సిద్ధం చేశారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ను కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

కంపార్ట్‌మెంట్లన్నీ నిండి...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట శిలా తోరణం వరకూ విస్తరించింది. దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 54,105 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,590 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.44 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.


Tags:    

Similar News