Palnadu : జూన్ 5 వరకూ పల్నాడులో 144 సెక్షన్

ప్రత్యేకమైన పరిస్థితులలో ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్ గా తనను నియమించిందని లత్కర్ శ్రీకేష్ బాలాజీ తెలిపారు;

Update: 2024-05-20 07:17 GMT
Palnadu : జూన్ 5 వరకూ పల్నాడులో 144 సెక్షన్
  • whatsapp icon

ప్రత్యేకమైన పరిస్థితులలో ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్ గా తనను నియమించిందరి జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లా కలెక్టర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు లో జరిగిన సంఘటనలు దేశం లోనే చర్చ నియాంశంగా మారిందన్నారు. పల్నాడు లో జూన్ 4వ తేదీన కొంటింగ్ సజావుగా జరిగేందుకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామన్నారు.

అల్లర్లు జరగకుండా...
కౌంటింగ్ తరువాత ఎటువంటి అల్లర్లు తలెత్తకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా లో అన్ని ప్రాంతాల్లో సజావుగా ఎన్నికలు జరిగినా కొన్ని ప్రాంతాలలో అల్లర్లు జరగడం వలన జిల్లాకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. జిల్లా కు చెడ్డ పేరు రావడం లో మన అందరి పాత్ర ఉందన్న కలెక్టర్ కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అందరి సహకారం అవసరమన్నారు. పల్నాడు జిల్లా లో వచ్చే నెల ఐదో తేదీ వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు.


Tags:    

Similar News