జగన్ ను నిలదీసిన ముద్రగడ.. తాజా లేఖ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు

Update: 2022-01-22 04:33 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఆయన ఈ లేఖలో జగన్ ను నిలదీశారు. ఓటీఎస్ పేరుతో ప్రజలపై వత్తిడి తేవడం తగదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన ఇళ్లకు మీరు ఓటీఎస్ పేరుతో ఎలా క్రమబద్దీకరిస్తారని, ఆ హక్కు మీకు ఎక్కడదని జగన్ ను ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.

ముందు వాటిని....
ఇప్పటి వరకూ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేకపోయారని ముద్రగడ ఎద్దేవా చేశారు. వారికి తొలుత వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓటీఎస్ విధానంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను గుర్తించాలని ముద్రగడ తన లేఖలో కోరారు.


Tags:    

Similar News