TDP : జగన్ ప్రతిపక్ష హోదాపై తేల్చిచెప్పిన పయ్యావుల
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిపక్షహోదాపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిపక్షహోదాపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, ఫ్లోర్ లీడర్ మాత్రమేనని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతిపక్ష హోదాకు పది శాతం హోదా ఉండాలనే నిబంధన రాజ్యాంగంలో లేదని జగన్ స్పీకర్ రాసిన లేఖపై పయ్యావుల స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభ నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని తెలిపారు. ఆయనకు ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం పదేళ్ల కాలం పడుతుందని పయ్యావుల ఎద్దేవా చేశారు.
ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు...
స్పీకర్ ను లేఖతో బెదిరించే ప్రయత్నమే చేశారన్న పయ్యావుల ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆయన తన సలహాదారులను మార్చుకుంటే మంచిదని సూచించారు. అసెంబ్లీ రూల్ బుక్ చదివితే ఈ విషయం తెలుస్తుందన్న పయ్యావుల జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే ప్రజలు ఆ విధమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. పదిశాతం సభ్యులు లేకుండా హోదా ఎలా వస్తుందని పయ్యావుల కేశవ్ జగన్ ను ప్రశ్నించారు.