మందుబాబుకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

మద్యం దుకాణాలు మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ మేరకు పోలీసులు ప్రకటన చేశారు

Update: 2024-05-29 03:36 GMT

మద్యం దుకాణాలు మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ మేరకు పోలీసులు ప్రకటన చేశారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కౌంటింగ్ కు ముందు, తర్వాత రోజు ఏపీలో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని డీజీపీ హరీశ్ గుప్తా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేస్తుండటంతో ఆ మూడు రోజులు దుకాణాలు మూతబడనున్నాయి.

ఇతర ప్రాంతాల నుంచి..
అయితే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా మద్యాన్ని అక్రమంగా తెచ్చి విక్రయానికి ప్రయత్నిస్తే చర్యలుంటాయని తెలిపారు. కౌంటింగ్ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయన్న నిఘా వర్గాల హెచ్చరికతో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని డీజీపీ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.


Tags:    

Similar News