మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ మద్యం దుకాణాల పనివేళలు రాత్రి 9 గంటల వరకే ఉండగా..;

Update: 2022-01-18 05:09 GMT
మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
  • whatsapp icon

మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ మద్యం దుకాణాల పనివేళలు రాత్రి 9 గంటల వరకే ఉండగా.. మరో గంట పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో నేటి నుంచి మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకూ పనిచేయనున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు రాత్రి 10 వరకు నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా.. నేటి నుంచే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కూడా అమలవ్వనుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. నిజానికి ఈ కర్ఫ్యూ సంక్రాంతికి ముందే అమల్లోకి రావాల్సి ఉండగా.. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేవారు కర్ఫ్యూ కారణంగా ఇబ్బంది పడ్డారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను జనవరి 18 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి జనవరి 31వ తేదీ వరకూ ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలవ్వనుంది.



Tags:    

Similar News