వేడుకగా ప్రారంభమైన శివరాత్రి సంగీత మహోత్సవాలు

మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల..

Update: 2022-02-28 12:14 GMT

తిరుపతి : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ముందుగా క‌ళాశాల‌, పాఠ‌శాల విద్యార్థుల ప్రార్థ‌న‌తో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, శ్రీ న‌ట‌రాజ‌స్వామికి పూజ‌లు చేశారు. మొద‌ట‌గా ఎస్వీ నాద‌స్వ‌రం డోలు పాఠ‌శాల విద్యార్థులు మంగ‌ళ‌క‌రంగా నాద‌స్వ‌రం, డోలు వాయిద్య‌ సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అనంతరం మోహ‌న‌కృష్ణ‌, ప‌వ‌న్‌కుమార్‌, రూపేష్ (విద్యార్థులు) ప‌లు భ‌క్తిగీతాల‌ను బృంద‌గానం చేశారు.


Tags:    

Similar News