TDP : మహానాడు వాయిదా.. రీజన్స్ చెప్పిన చంద్రబాబు

ఈ నెల మహానాడును వాయిదా వేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు

Update: 2024-05-16 06:17 GMT

ఈ నెల మహానాడును వాయిదా వేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 27, 28 వతేదీల్లో మహానాడు జరగాల్సి ఉంది. ప్రతి ఏడాది మహానాడును అదే తేదీలలో నిర్వహిస్తారు. అయితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉండటం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు హడావిడి ఉండటంతో మహానాడును వాయిదా వేసినట్లు ఆయన ప్రకటించారు.

ఆ తేదీల్లో అన్ని కార్యక్రమాలు...
అయితే ఆ తేదీల్లో మహానాడు జరిగినట్లుగానే భావించి అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కు నివాళులర్పించాలని, పార్టీ జెండాలను ఎగురవేయాలని, రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కోరారు. మహానాడు నిర్వహణ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News