ఫొటో కోసం వందే భారత్ రైలెక్కితే.. ఇక అంతే సంగతి ! ఈ వీడియో చూడండి..
ఓ పెద్దాయన ఆ రైలు లోపలికి వెళ్లి.. ఫొటో తీసుకున్నాడు. రైలు దిగబోతే కదిలింది. నేను రైలు దిగాలి.. డోర్ తీయండని..
వందేభారత్.. రెండ్రోజుల క్రితం ఏపీ నుండి తెలంగాణకు.. అదేనండి విశాఖ నుండి సికింద్రాబాద్ కు పరుగులు పెడుతూ మొదలైంది. విశాఖ నుండి బయల్దేరిన ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతూ.. సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగుపయనంలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతూ.. విశాఖకు చేరుకుంటుంది. ఇక ఈ రైలులో ప్రయాణించాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సిందేనని తెలిసిన విషయమే. సామాన్యుడికి వందేభారత్ లో ప్రయాణం భారమే. కానీ.. ఒక్కసారైనా ప్రయాణించాలంటే..మాత్రం ఖర్చు చేయక తప్పదు.
సికింద్రాబాద్ నుండి విశాఖ కు 10.10 గంటల్లో.. విజయవాడకు నాలుగు గంటల్లో ఈ రైలు చేరుకుంటుంది. అత్యవసరంగా వెళ్లేవారు.. తమ సమయాన్ని ఆదా చేసుకోవాలంటే.. ఇదే బెస్ట్ ట్రైన్. కాగా.. అదే టిక్కెట్ ధరలోనే.. ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం మీల్స్, నైట్ డిన్నర్ అందిస్తున్నారు. అదీ కూడా ది బెస్ట్ క్వాలిటీలో. అందుకే టిక్కెట్ ధర ఎక్కువగా ఉందని ప్రయాణికుల అభిప్రాయం.
ఇక అసలు విషయానికొస్తే.. వందేభారత్ రైలులో ప్రయాణించలేకపోయినా.. రైలులోకి వెళ్లి ఫోటోలు దిగుతున్నారు ప్రజలు. అలా విశాఖ నుండి సికింద్రాబాద్ కు వెళ్తున్న వందేభారత్ రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగింది. ఓ పెద్దాయన ఆ రైలు లోపలికి వెళ్లి.. ఫొటో తీసుకున్నాడు. రైలు దిగబోతే కదిలింది. నేను రైలు దిగాలి.. డోర్ తీయండని అడిగాడు టీసీని. ఆ డోర్ ఒకసారి క్లోజ్ అయితే మళ్లీ తర్వాతి స్టేషన్లోనే తెరుచుకుంటుంది.. దిగడం కుదరదు.. విజయవాడ వరకూ ఆగాల్సిందేనని చెప్పడంతో.. ఆ పెద్దాయనకు నోటమాట రాలేదు. అయినా ఫోటోల కోసం రైలెక్కడం ఏంటని ప్రశ్నించారు. మరో ఆరుగంటలు ఈ రైల్లో ఉండాల్సిందే. మామూలు రైళ్లకు లాగా డోర్ ఎప్పుడుపడితే అప్పుడు రాదని అధికారులు చెప్పడంతో.. మిన్నకుండిపోయాడు. అతనికి విజయవాడ వరకూ ప్రయాణించే టిక్కెట్ ధర + పెనాల్టీ ఖర్చు + తిరుగుప్రయాణం ఖర్చు కలిపి వేశాడు టీసీ. కాబట్టి.. ఫోటోలకోసమని రైలు ఎక్కకండి. ఒక్కఫోటో జీవితాన్నే మార్చేస్తుంది. ఒకసారి ఎక్కితే తర్వాతి స్టేషన్ వరకూ దిగే ఛాన్స్ ఉండదు. జాగ్రత్త మరి.