ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అప్పటి నుంచే నట.. మంత్రి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఏపీలో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై...
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. కారుణ్య నియామకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆర్టీసీలో ఏడువేల మంది సిబ్బంది కొరత ఉందని, వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న ఆర్టీసీపై మరొక సారి సమీక్షించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చిస్తారని మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు.