ఆళ్లకు అస్వస్థత.. విశ్రాంతి అవసరమన్న వైద్యులు
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు.
వివిధ పనుల్లో....
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా వివిధ రకాల పనులతో బిజీగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో శ్రమకు లోనయ్యారని కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆసుపత్రికి వెళ్లడంతో వైసీపీ నేతలు, ఆయన అభిమానులు ఆళ్ల నివాసానికి వచ్చి పరామర్శిస్తున్నారు.