YSRCP : వైసీపీలో నేడు చేరిన నేతలు ఎవరంటే?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేడు పలువురు నేతలు చేరారు. జగన్ సమక్షంలో ముగ్గురు నేతలు పార్టీలో జాయిన్ అయ్యారు;

third list of the in-charges of ysr congress party constituencies
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేడు పలువురు నేతలు చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ముగ్గురు నేతలు పార్టీలో జాయిన్ అయ్యారు. వారిని వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనను పార్టీలోకి జగన్ స్వాగతం పలికారు.
ఏలూరు టీడీపీ నేత...
అలాగే ఏలూరు టీడీపీ నేత గోరుముచ్చి గోపాల్ యాదవ్ కూడా జగన్ ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన ఏలూరు పార్లమెంటు టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ నేడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కలిశారు. ఆయన పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రవి చాలా కాలంగా సైలెంట్ గా ఉండి తిరిగి యాక్టివ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.