టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన కారు బోల్తా పడింది.
రోడ్డు ప్రమాదంలో...
టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. తీవ్రగాయాలైన నారాయణరెడ్డిని యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. తమ నేతకు యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న పలువురు ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్‌కు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. కందుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.