పవన్ కు మెగా కుటుంబం అండ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమాలకు మెగా కుటుంబం అండగా నిలిచింది
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమాలకు మెగా కుటుంబం అండగా నిలిచింది. పవన్ తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు ఆయన కుటుంబ సభ్యులు చేయూత నిచ్చారు. గత కొంతకాలంగా పవన్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలను ఇస్తున్నారు. కౌలు రైతులను గుర్తించి ఈ సహాయాన్ని అందచేస్తున్నారు.
తమ వంతుగా...
రైతు భరోసా కార్యక్రమానికి పవన్ తన సొంత నిధులను ఐదు కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ దశలో పవన్ కు అండగా నిలవాలని ఆయన కుటుంబం ముందుకు వచ్చింది. హీరో వరుణ్ తేజ్ పది లక్షలు, సాయిధరమ్ తేజ్ పది లక్షలు, వైష్ణవ్ తేజ్, నీహారిక చెరి ఐదు లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కులను రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు అందజేశారు.