సస్పెన్షన్‌పై మేకపాటి సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు నుంచి ఉదయగిరి నియోజకవర్గానికి సస్పెన్షన్‌కు గురైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు
బెంగళూరు నుంచి ఉదయగిరి నియోజకవర్గానికి సస్పెన్షన్‌కు గురైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. నేరుగా ముఖ్యకార్యకర్తలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తర్వాత ఆయన నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. తనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేనని ముందే చెప్పడంతో బాధపడ్డానని, అయితే తాను క్రాస్ ఓటింగ్ కు తాను పాల్పడలేదని తెలిపారు.
ఉదయగిరికి చేరుకున్న మేకపాటి...
తాను పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని, వాళ్లే పంపించారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తన కుమార్తెకు అవకాశం కల్పించాలని తాను కోరినా జగన్ ఇవ్వకపోవడంతో బాధపడి బయటకు వచ్చానని తెలిపారు. ఏదో ఒక సాకు చెప్పి తనను సస్పెండ్ చేశారని తెలిపారు. తాను జనంలోనే ఉంటానని, జనం తనతోనే ఉంటారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో తమ కుటుంబానికి పేరుందని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్టు చేసే వాళ్లంతా వెధవలకే నంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఏ టీడీపీ నేతలు పిలవలేదని, తాను స్వతంత్ర ఎమ్మెల్యేగానే కొనసాగుతానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.