హైకోర్టులో లంచ్‌మోషన్ పిటీషన్
తనకు రక్షణ కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారు.
తనకు రక్షణ కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారు. ఆయన లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. ఈ నెల 4వ తేదీన భీమవరం పర్యటనకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఆ పర్యటనలో తాను ఎంపీగా పాల్గొనాల్సి ఉందని రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారించేందుకు కోర్టు అనుమతించింది.
రక్షణ కల్పించాలంటూ...
అయితే రఘురామ కృష్ణరాజును ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన తరుపున న్యాయవాదులు వివరించారు. అందుకే ఆయనపై ఎలాంటి కేసులు లేకుండా రక్షణ కల్పించాలని న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు.