ఉద్యోగుల వినతిని అంగీకరించని పోలీస్ కమిషనర్
పీఆర్సీ సాధన సమితి సభ్యులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాను కలిశారు. రేపటి చలో విజయవాడకు అనుమతివ్వాలని కోరారు.
పీఆర్సీ సాధన సమితి సభ్యులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాను కలిశారు. రేపటి చలో విజయవాడకు అనుమతివ్వాలని కోరారు. తాము శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తామని, సభకు కూడా అనుమతి ఇవ్వాలని కాంతిరాణాను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.
వాహనాల రాకపోకలపై నిషేధం...
అయితే దీనికి కాంతి రాణా అంగీకరించలేదు. కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని ఆయన తెలిపారు. ఖచ్చితంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని జరిపి తీరుతామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. దీంతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. రేపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం గంటల వరకూ బీఆర్టీఎస్ రోడ్డులో ఎలాంటి వాహనాలకు అనుమతించడం లేదు. విజయవాడ నలువైపుల చెక్ పోస్టలను ఏర్పాటు చేసి తనిఖీ చేసిన తర్వాతనే సిటీలోకి వాహనాలకు అనుమతి ఇస్తున్నారు.