విధేయతకు వీరతాడు

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మేరుగ నాగార్జున కు మంత్రి పదవి దక్కింది.

Update: 2022-04-11 06:43 GMT

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మేరుగ నాగార్జున కు మంత్రి పదవి దక్కింది. ఈయనకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి లభించింది. 2009లో తొలిసారి వేమూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా మేరుగ నాగార్జునను నియమించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు టిక్కెట్ ఇచ్చారని మేరుగ నాగార్జున ఇప్పటికీ చెప్పుకుంటారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మేరుగ నాగార్జున 2014లో వేమూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో విజయం సాధించారు. విధేయత కారణంగానే మేరుగ నాగార్జునకు మంత్రి పదవి దక్కింది.


Tags:    

Similar News