Andhra Pradesh : ఏపీలో ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయంటే?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలపింది

Update: 2024-06-15 04:22 GMT

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలపింది. రాబోయే మూడు రోజులు తేలిక పాటి వర్షాలు మాత్రమే పడతాయని తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

పిడుగులు పడతాయని...
అయితే రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ నిదానంగా ముందుకు కదులుతున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రమంతటా విస్తరించలేదని వాతవరణ శాఖ పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు నైరుతి రుతు పవనాలు ప్రవేశించేందుకు మరో రెండు మూడు రోజులు సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.


Tags:    

Similar News