Weather Report : నేటి నుంచి ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి మూడు రోజులు వరసగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రేపటి నుంచ అంటే బుధవారం నుంచి మూడు రోజుల పాటు గురు, శుక్రవారాల్లో ఏపీలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా తెలిపింది.
ఈరోజు వర్షం పడే ప్రాంతాలు...
ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనాగా ఉంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, కడప, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అందుకే ఈరోజు నుంచి ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బలమైన గాలులు...
రైతులు ప్రధానంగా తమ పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించింది. వర్షానికి ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటే మంచిదని సూచించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు కూడా అలెర్ట్ గా ఉండాలని తెలిపింది. అలాగే ఈదురుగాలులు కూడా వీస్తాయని, ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నా అది వాయుగుండంగా మారే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ఈ నెల 11న శ్రీలంక - తమిళనాడుల మధ్య తీరాన్ని తాకవచ్చని పేర్కొంది.